ఇండియా ప్రజలకు శుభవార్త..ఇవాళ కేవలం 44,877 కరోనా కేసులే నమోదు

-

మన దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌.. నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. నిన్న కాస్త పెరిగిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ తగ్గిపోయాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 44,877 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అంటే రోజువారి కరోనా కేసుల నమోదు శాతం 3,17 శాతంగా నమోదు అయిందన్న మాట. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 5,37,045 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది.

ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 170.95 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,17,591 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,15,85,711 కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 49.16 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Exit mobile version