ఇండియాలో భారీగా పెరిగిన కరోనా… కొత్తగా 22,775 కేసులు.. థర్డ్ వేవ్ తప్పదా ?

-

ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున తగ్గిన కరోనా కేసులు… ఇవాళ భారీగా పెరిగాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 22,775 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,04,781 కు చేరింది.

ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.32 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 406 మంది కరోనా తో మరణించారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8,949 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక ఇండియా లో ఇప్పటి వరకు ఓమిక్రాన్ 1431 కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 454 ఓమిక్రాన్ కేసులు, ఢిల్లీలో 351, తమిళనాడులో 118, గుజరాత్ రాష్ట్రంలో 115, కేరళలో 109, రాజస్థాన్ లో 69, తెలంగాణ రాష్ట్రంలో 62 కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఓమిక్రాన్ నుంచి 488 మంది కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version