ఇండియాలో కరోనా టెర్రర్‌.. ఒక్క రోజు 1.59 లక్షలు కేసులు

-

మన ఇండియాలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుంది. గతంలో కంటే… ప్రస్తుతం కరోనా కేసులు రెట్టింపు అయి… విజృంభిస్తుంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,59,632 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 5,90,611 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.36 శాతంగా ఉంది.

రోజు వారి కరోనా పాజిటివిటీ రేటు ఏకంగా 10.21 కు చేరింది. ఇక దేశంలో తాజాగా 327 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,83,790 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 40,863 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,44,53,603 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 151.58 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 56,91,175 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. అటు ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 3623 కు చేరంది. అలాగే.. ఇప్పటి వరకు 1409 మంది ఒమిక్రాన్‌ నుంచి కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version