ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభణ క్రమ క్రమంగా తగ్గుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1660 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,18,032 కు చేరింది.
ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 16,741 కు చేరింది.
ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 89.16 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 4100 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,20,855 కి చేరింది.
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2349 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,24,80,436 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,82,87,68,476 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 29,07,479 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.