ఇండియాలో కరోనా కేసుల తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్న తగ్గిన కరోనా కేసుల సంఖ్య ఇవాళ కాస్త పెరిగింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం…. గడిచిన 24 గంటల్లో దేశంలో 13,091 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,38,556 కు చేరింది. దేశంలో ఇంత తక్కువగా యాక్టివ్ కేసులు నమోదవడం 266 రోజుల తర్వాత ఇదే మొదటి సారి. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.25 శాతంగా ఉంది.
ఇక దేశంలో తాజాగా 340 మంది కరోనా తో మరణించారు. గడిచిన 24 గంట ల్లో దేశ వ్యాప్తం గా 13, 091 మంది కరోనా నుంచి కోలు కున్నారు. దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 3,38,00,925 కు చేరింది. ఇక దేశ వ్యాప్తంగా…. 61.99 కోట్ల కరోనా పరీక్షలు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. అలాగే… రోజూ వారి… పాజిటివిటీ రేట్ 1.10 శాతంగా నమోదైంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 110.23 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.
#Unite2FightCorona#LargestVaccineDrive
𝐂𝐎𝐕𝐈𝐃 𝐅𝐋𝐀𝐒𝐇https://t.co/FrxOT24YlR pic.twitter.com/yUh9VDXz7i
— Ministry of Health (@MoHFW_INDIA) November 11, 2021