పార్లమెంట్ నియోజకవర్గాల అభివ్రుద్దికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఎంపీలకు ఇచ్చే లోకల్ ఏరియా డెవలప్ మెంట్ స్కీమ్ ( ఎంపీ లాడ్స్) నిధులను పునరుద్దరించింది. దీనికి సంబంధించి నిన్న కేంద్ర కాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా గతేడాది నుంచి ఎంపీలకు ఇచ్చే ఎంపీలాడ్స్ నిధులను తాత్కాలికంగా కేంద్ర నిలపివేసింది. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఎంపీలు తమ నియోజకవర్గాలను మరింత డెవలప్మెంట్ చేసుకునే అవకాశం లభించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలానికి నిధులు విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మిగిలిన కాలానికి ఒక్కో ఎంపీకి 2 కోట్ల రూపాయల చొప్పున ఎంపీ లాడ్స్ కింద ఒకే సారి నిధులను విడుదల చేయనుంది. ఎంపీ లాడ్స్ నిధుల కింద ఏడాదికి ఒక్కో ఎంపీకి రూ. 5 కోట్లను ఇస్తుంది కేంద్రప్రభుత్వం. ప్రస్తుతం రెండున్నర కోట్ల రూపాయల చొప్పునా రెండు విడతలుగా ఈ నిధులను అందచేయనుంది. కరోనా విజృంభణతో వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద మొత్తంలో నిధులు అవసరమయ్యాయి. దీంతో గతేడాది ఏప్రిల్‌లో ఎంపీ ల్యాడ్స్‌ను ఆపి… ఆ నిధులు వైద్య రంగం అవసరాలకు వినియోగించుకుంది కేంద్ర ప్రభుత్వం. 2026 వరకు ఈ పథకాన్ని కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది.