మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.ఈ ప్రకృతి విలయం కారణంగా 700 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.వెయ్యికి పైగా గాయపడ్డారు.వేలాదిగా ప్రజలు నిరాశ్రయులు అయినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో మయన్మార్‌కు తక్షణ సాయం అందించడానికి..సహాయక చర్యలు, ప్రాణాలతో బయటపడిన వారికి ఉపశమనం కోసం ‘ఆపరేషన్ బ్రహ్మ’ను భారత ప్రభుత్వం ప్రారంభించింది.
ఈ క్రమంలోనే సహాయ సామగ్రితో కూడిన భారత వైమానిక దళానికి చెందిన కార్గో విమానం శనివారం ఉదయం యాంగోన్‌కు చేరుకుంది.ఇది ఉపశమన ప్యాకేజీలో తొలి దశ మాత్రమే అని, ఆ తర్వాత మరింత సాయం అందిస్తామని భారత అధికారులు వెల్లడించారు.’ఆపరేషన్ బ్రహ్మ’ పేరుతో బాధిత మయన్మార్ ప్రజలకు భారత్ సాయం అందించనుంది. బాధితుల కోసం టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, ఆహార ప్యాకెట్లు, హైజీన్ కిట్లు, జనరేటర్లు, అవసరమైన మొదలు సహా ఇతర వస్తువులు కలిపి 15 టన్నుల సామగ్రిని మొదటి విడతలో యాంగోన్‌కు చేర్చినట్లు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.