న్యూస్ లైన్ నిర్వాహకుడు యూట్యూబర్ శంకర్ పై కేసు నమోదు !

-

జర్నలిస్ట్, న్యూస్ లైన్ తెలుగు నిర్వాహకుడు యూట్యూబర్ శంకర్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. యూట్యూబర్ శంకర్ పై తాజాగా కేసు నమోదు అయింది. తనపై జర్నలిస్టు శంకర అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు… 69, 69,79,352, 351(4) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు అంబర్ పేట పోలీసులు.

Case registered against Newsline administrator YouTuber Shankar

పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని బాధితురాలు ఆరోపణలు చేసింది. పెళ్లి విషయంలో బలవంతం చేసినందుకు శంకర్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు మహిళ. ఇక ఈ సంఘటన పై యూట్యూబర్ శంకర్ పై తాజాగా కేసు నమోదు అయింది.మరి దీనిపై జర్నలిస్ట్, న్యూస్ లైన్ తెలుగు నిర్వాహకుడు యూట్యూబర్ శంకర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news