బీజేపీ: రేపటితో మోదీ పాలనకు 9 ఏళ్ళు…

-

భారతదేశంలో కాంగ్రెస్ పాలన అంతమయ్యి రేపటికి తొమ్మిదేళ్లు అవుతుంది. అదే సమయంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి రేపటికి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా మోదీపై బీజేపీ మద్దతుదారులు ప్రశంసల వర్షం కురిపిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకులు మోదీని విమర్శిస్తున్నారు. తన స్వార్ధం కోసం అర్ధం పర్థం లేని ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టాడని అంటున్నారు. 2014వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో దేశ వ్యాప్తంగా మెజారిటీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ మరియు ఎన్డీఏ లు అధికారాన్ని ఏర్పరిచాయి. ఆ ప్రభుత్వంలో గుజరాత్ నుండి ఎంపీగా గెలిచిన నరేంద్ర మోదీని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. మే వ తేదీ 2014 న మోదీ భారత్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు.

ఆ తర్వాత 2019 లోనూ బీజేపీకి ఎదురులేకపోవడంతో వరుసగా రెండవ సారి ప్రధానిగా మోదీ ఉన్నారు. అలా రేపటితో తొమ్మిది సంవత్సరాలు పూర్తి కానుంది. ఇక వచ్చే సంవత్సరం జరగనున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మోదీని దేశ ప్రజలు గద్దె దించుతారు అన్న నమ్మకమతో విపక్షాలు అన్నీ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version