రాష్ట్రానికి ప్రధాని వస్తే కలిసే సంస్కారం సీఎం కేసీఆర్ కు లేదు – కిషన్ రెడ్డి

-

సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో పడిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నేడు సికింద్రాబాద్ లోని క్లాసిక్ గార్డెన్స్ లో బిజెపి హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తే కలిసే సంస్కారం సీఎం కేసీఆర్ కి లేదని మండిపడ్డారు.

కెసిఆర్ తెలంగాణలో దోపిడీ చేసిన డబ్బును దేశమంతా రాజకీయ నాయకులకు పంపించడానికి బిఆర్ఎస్ పార్టీ పెట్టారని విమర్శించారు. మోడీని గద్దె దించడానికి ఎంత డబ్బు అయినా ఖర్చు చేస్తానని కేసీఆర్ అంటున్నారని.. ఆ డబ్బు ఎవరిదో తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. కల్వకుంట్ల కుటుంబం చేయని అవినీతి లేదన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. ఆ మార్పు బిజెపితోనే సాధ్యమన్నారు. మోడీ ఏ దేశానికి వెళ్లిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version