బిగ్ బ్రేకింగ్ : భారత్ లో వ్యాక్సిన్ కి డీసీజీఐ అనుమతి..మరో వారంలో మొదలు !

-

భారత్ లో కరోనా వ్యాక్సిన్ మొదలు కానుంది. మరో వారంలో భారత్ లో మూడు కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ వేయడానికి రంగం సిద్దం అయింది. ఇప్పటికే కోవిషీల్డ్, అలానే కోవాగ్జిన్ వ్యాక్సిన్ లకు నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. ఇక ఈ ఉదయం సమావేశం అయిన డీజీసీఐ(డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా) కోవిషీల్డ్, అలానే కోవాగ్జిన్ వ్యాక్సిన్ ల వినియోగానికి అనుమతిచ్చింది.

అనుమతిస్తున్నట్టు డీజీసీఐ కీలక ప్రకటన చేసింది. ఈ అనుమతి లభించడంతో మరో వారంలోనే భారత్ లో వ్యాక్సిన్ మొదలు కానుంది. కోవాగ్జిన్ మూడో దశ ట్రైల్స్ జరుగుతున్నాయని డీజీసీఐ పేర్కొంది. అయినా ఈ వ్యాక్సిన్ లలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని డీజీసీఐ పేర్కొంది. నిపుణుల కమిటీ రెండు వ్యాక్సిన్ లకు అత్యవసర అనుమతిచ్చిందని డీజీసీఐ  పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version