కర్నూల్ జిల్లా శ్రీశైలం దేవస్థానంలో అన్యమతస్తులకు సంబంధించి మరో వివాదం చెలరేగింది. ముస్లీం మైనారిటీ షాపుల విషయం ముగియక ముందే బైబిల్ తో గుడిలోకి వెళ్లాలని అన్యమతస్తులు ప్రయత్నించినట్టు గుర్తించారు. ఉచిత క్యూలైన్ల వద్ద బైబుల్ తో వెళ్తున్న వ్యక్తులను గమనించిన దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు.
క్యూలైన్ల వద్ద బ్యాగ్ ని పరిశీలించగా అందులో బైబుల్ ఉన్నట్టు గుర్తించిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహ రెడ్డి, బైబుల్ ని స్వాధీనం చేసుకొని అన్యమతస్థులను వదిలేసినట్టు సమాచారం. వారికి సంబందించిన వీడియోలు గాని ఫోటోలు గాని మా వద్ద లేవని సి.ఎస్.ఓ నరసింహ రెడ్డి పేర్కొన్నారు. బైబుల్ ను స్వాధీనం చేసుకొని చింపేసి బయట పడేశామని నరసింహారెడ్డి చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తీ సమాచారం అందాల్సి ఉంది.