టి20 ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ టీమిండియా మరియు స్కాట్లాండ్ జట్ల మధ్య రసవత్తర మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా… బౌలింగ్ ఎంచుకుంది. దీంతో స్కాట్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ కు దిగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో జరుగుతోంది. టీం ఇండియా ఈ మ్యాచ్ లో గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…
స్కాట్లాండ్ (ప్లేయింగ్ XI): జార్జ్ మున్సే, కైల్ కోయెట్జర్(సి), మాథ్యూ క్రాస్(w), రిచీ బెరింగ్టన్, కాలమ్ మాక్లియోడ్, మైకేల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్, సఫ్యాన్ షరీఫ్, అలస్డైర్ ఎవాన్స్, బ్రాడ్లీ వీల్
భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(సి), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, వరుణ్ చకరవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా