పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన టర్కీ ..

-

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తరువాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రెండు దేశాలు సైనిక సిద్ధత పెంచుకుంటున్న నేపథ్యంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ దాడిపై అమెరికా, రష్యా, ఇజ్రాయెల్, ఇటలీ, ఫ్రాన్స్ దేశాలు భారత్‌కు మద్దతు తెలిపాయి. ఉగ్రవాదానికి కట్టడి అవసరమని, భారత్‌కి తాము అండగా ఉంటామని పేర్కొన్నాయి. ఇదే సమయంలో, పాకిస్తాన్ తన స్నేహ దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. చైనా, మలేషియా, అజర్‌బైజాన్‌లతో పాటు టర్కీతో కూడా సంబంధాలు బలపరుచుకుంటోంది. టర్కీ పాకిస్తాన్‌కు మద్దతుగా ఆయుధాల సరఫరా చేస్తోందన్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి.

పలు రిపోర్టుల ప్రకారం, టర్కీ నుండి వచ్చిన C-130E హెర్క్యులెస్ కార్గో విమానాలు కరాచీలో దిగినట్టు తెలుస్తోంది. మొత్తం ఆరు విమానాలు పాకిస్తాన్‌కు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే, టర్కీ ఈ ఆరోపణలను ఖండించింది. ఈ విమానాలు కేవలం ఇంధనం కోసం ఆగాయని, ఆయుధాలు లేదా మిలిటరీ సరఫరాలు లేవని అధికారికంగా స్పష్టం చేసింది. టర్కీ పాకిస్తాన్‌కు మిత్ర దేశంగా ఉన్నా, యుద్ధ వాతావరణంలో తాము ఏ పాత్ర పోషించట్లేదని తెలిపింది. గతంలో కాశ్మీర్ అంశంలో టర్కీ తరచూ పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచిన సందర్భాలు ఉన్నప్పటికీ, భారత్ తక్షణంగా స్పందిస్తూ, కాశ్మీర్ తన దేశ అంతర్భాగమని పేర్కొంది.

 

Read more RELATED
Recommended to you

Latest news