ఆలయాలే పాక్ టార్గెట్ : విక్రమ్ మిస్రీ

-

ఇండియా-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ, పాకిస్తాన్ భారత్‌లోని నాలుగు ప్రధాన విమానాశ్రయాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని కుట్రపూరిత దాడులు జరిపిందని తెలిపారు. ప్రత్యేకంగా గురుద్వారాలపై దాడులు చేసి దేశంలో మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలన్న ఉద్దేశంతో పాక్ ప్రయత్నించిందని వెల్లడించారు.

భారత త్రివిధ దళాలు పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టినట్లు తెలిపారు. పాకిస్తాన్ ఉపయోగించిన దాదాపు 400 డ్రోన్లను భారత సైన్యం కూల్చివేసిందని చెప్పారు. శాంతి సూచనలు చేస్తూనే దాడులకు పాల్పడే పాక్ తీరును ప్రపంచం ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఎల్ఓసీ వెంబడి లేహ్ నుంచి సర్ క్రీక్ వరకు మొత్తం 36 చోట్ల పాక్ దాడులు జరిపిందని మిస్రీ తెలిపారు. పౌర విమానాలను రక్షణగా వాడుతూ దాడులకు పాల్పడుతున్న పాక్ చర్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సముదాయానికి పాకిస్తాన్‌కు సహాయం చేయొద్దని భారత్ విజ్ఞప్తి చేస్తుందన్నారు. పాక్ చిలిపి ప్రవర్తనను తిప్పికొట్టేందుకు త్రివిధ దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news