పోస్టాఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్: ఇలా చేస్తే ఏ రిస్క్ లేకుండా అదిరిపోయే రాబడి మీ సొంతం…!

-

డబ్బులని వెనకేయాలనుకుంటున్నారా …? అయితే తప్పకుండ ఈ స్కీమ్ గురించి చూడండి. దీనిలో ఏ రిస్క్ కూడా ఉండదు. ఏడాది నుంచి ఐదేళ్ల కాల పరిమితి వరకు డబ్బులు దాచుకోవచ్చు. మరి అటువంటి అదిరిపోయే స్కీమ్ గురించి ఇప్పుడే తెలుసుకోండి. వివరాలలోకి వెళితే… ఇప్పటికే పోస్టాఫీస్ ఎన్నో సేవలని అందిస్తోంది. ఇలా అందించే వాటిలో ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఒక పార్ట్.
అలానే ఇక్కడ మీకు ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. మీ డబ్బులు సురక్షితంగా ఉంటాయి. రిస్క్ లేకుండా మంచి రాబడి వస్తుంది కనుకే చాల మంది వాళ్ళు సంపాదించే డబ్బులని ఇక్కడ ఉంచుతారు.

పోస్టాఫీస్ అందించే సేవల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ FD స్కీమ్ కూడా ఉంది. దీనిలో మీకు కావాల్సినన్ని ఏళ్ళు డబ్బులు దాచుకోవచ్చు. ఏడాది నుండి మీకు నచ్చినన్ని సంవత్సరాలకి ఫిక్స్‌డ్ డిపాజిట్ చెయ్యొచ్చు. ఒక్క అకౌంట్‌ లో ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేయగలం. అలాగే ఒక వ్యక్తి ఎన్ని ఎఫ్‌డీ అకౌంట్లనైనా ఓపెన్ చేయొచ్చు. ఇది ఇలా ఉండగా ఎఫ్‌డీ కనుక ఇక్కడ చేస్తే 5.5 శాతం నుంచి 6.7 శాతం వరకు వడ్డీ మీ చేతికి వస్తుంది. FD చెయ్యడానికి కనీసం రూ.1000 తో చేసేయొచ్చు.

అలానే దీనిలో గరిష్ట పరిమితి అంటూ కూడా లేదు. మీరు ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువ రాబడి కూడా అందుతుంది. ఒకవేళ మీరు రూ.10 లక్షలుని పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్ ‌లో ఇన్వెస్ట్ చేసారంటే…. ఐదేళ్ల కాల పరిమితి కలిగిన ఎఫ్‌డీ స్కీమ్‌ను ఎంచుకుంటే…. మెచ్యూరిటీ సమయంలో రూ.13.8 లక్షలు వస్తాయి. దీని బట్టి చూస్తే ఐదేళ్ల లో వడ్డీ రూపం లో మీకు రూ.3.8 లక్షలు వస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version