టోక్యో ఒలింపిక్స్ లో 7 పతకాలుసాధించిన భారత్.. ప్రస్తుతం జరుగుతున్న ప్యారిస్ ఒలింపిక్స్ లో అంతకు మించి పతకాలు సాధిస్తుంది అని క్రీడా అభిమానులు అందరూ భావించారు. కానీ ఈ ఒలింపిక్స్ ప్రారంభమైన తర్వాత సిన్ రివర్స్ అయ్యింది. మెడల్ ఆశలు ఉన్న చాలామంది క్రీడాకారులు నిరాశపరిచారు. ఇక ఇప్పటివరకు వచ్చిన మూడు పతకాలు కూడా షూటింగ్ లోనే రాగ.. ఇప్పుడు షూటింగ్ లోనే మరో మెడల్ కోసం భారత్ పోటీ పడనుంది.
స్కీట్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్ లో భారత జట్టు 3వ స్థానంలో నిలిచింది. అయితే ఈ ఈవెంట్ లో మొదటి రెండు స్థానాల్లో ఉన్న టీమ్స్ గోల్డ్ కోసం పోటీ పడితే 3, 4 స్థానాల్లో ఉన్న జట్లు కాంస్యం కోసం పోటీ పడుతాయి. దాంతో భారత జట్టు కాంస్య పతకం కోసం చైనాతో పోటీ పడనుంది. ఈ క్వాలిఫికేషన్ లో మొత్తం 150 పాయింట్స్ కు గాను భారత్ 146 స్కోర్ చేసింది.