తెలంగాణాలో త్వరలో ఉప ఎన్నికలు.. కేటీఆర్ మాటల వెనుక పరమార్దం ఏంటో..

-

తెలంగాణాలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.. బీఆర్ ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది.. ఈ క్రమంలో అక్కడ ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.. దీనిపై ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల్లో చర్చ నడుస్తోంది.. అసలు ఉప ఎన్నికలు తెలంగాణాలో ఇప్పుడు సాధ్యమా..? కేటీఆర్ మాటల వెనుక ఉన్న ఆంతర్యమేంటో చూద్దాం..

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.. కారు పార్టీ ఎమ్మెల్యేలు సుమారు 10 మంది హస్తం గూటికి చేరారు.. దీంతో అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం తగ్గిపోయింది.. ఈ క్రమంలో వారిమీద అనర్హత వేటు వేయించేందుకు ఆ పార్టీ నాయకత్వం సిద్దమైంది.. ఈ విషయంపై రాజ్యాంగ నిపుణులతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం సమావేశం అయిందట. మరో నెల రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వెయ్యాలంటూ పార్టీ తరపున కోర్టుకు వెళ్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు.. ఈ ప్రకటన ప్రస్తుతం తెలంగాణా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది..

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పార్టీకి ద్రోహం చేసిన వారిని ప్రజాక్షేత్రంలోనే ఎదుర్కొంటామని ఆ పార్టీ నేతలు అంటున్నారు.. సుప్రీం కోర్టు నుంచి తీర్పు వస్తే నెలరోజుల్లోనే ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి.. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్బ పార్టీ దూకుడుకు బీఆర్ ఎస్ తట్టుకోగలదా అన్న సందేహాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తపరుస్తున్నారు.

అధికారంలో ఉండటం.. దానికి తోడు ప్రభుత్వం ఏర్పడి కూడా తక్కువ సమయమే కావడంతో.. ప్రజల్లో వ్యతిరేక ఉండే అవకాశం లేదని.. ఈ సమయంలో ఉప ఎన్నికలు అంటే బీఆర్ ఎస్ కూ జీవన్మరణ సమస్యగా ఉంటుందని స్వంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకే కేటీఆర్ ఈ కామెంట్ చేసి ఉంటారన్న ప్రచారం కూడా నడుస్తోంది.. ఇంతకీ తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయో రావో చూడాలి మరీ..

Read more RELATED
Recommended to you

Exit mobile version