వ్యాక్సిన్ పంపిణీలో భారత్ మూడో స్థానం..!

-

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ మూడో స్థానానికి చేరుకుంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించి కొన్ని నెలలు గడుస్తున్నా.. ఇంతలోనే దాదాపు కోటి మందికి పైగా టీకాను అందజేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తున్న దేశాల్లో అమెరికా, బ్రిటన్ దేశాలు ముందువరుసలో ఉండగా.. భారత్ మూడో స్థానంలో ఉందని తెలిపింది. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ వల్ల ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటికే పలు దేశాలు కరోనా వ్యాక్సిన్‌పై ప్రయోగాలు చేస్తున్న విషయం కూడా తెలిసిందే. కొన్ని నెలల కిందట ప్రారంభించిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సత్ఫలితాలనే అందించాయి.

Vaccination

రెండు నెలల కిందట వ్యాక్సినేషన్ ప్రారంభించిన అమెరికా ఇప్పటివరకు ఐదున్నర కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. బ్రిటన్ దేశంలోనూ ఇప్పటివరకూ కోటిన్నర మందికి వ్యాక్సిన్ అందజేసినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా భారత్ కూడా 94 లక్షల మందికిపైగా కరోనా వ్యాక్సిన్ అందజేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. అమెరికా, బ్రిటన్ దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించి 60 రోజులు గడుస్తుండగా.. భారత్ మాత్రం 33 రోజుల్లోనే 94 లక్షల మందికిపైగా వ్యాక్సిన్ పంపిణీ చేయడం గర్వకారణం.

భారత దేశవ్యాప్తంగా జనవరి 16వ తేదీన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి బాధితులను టీకా ఇవ్వడం మొదలుపెట్టింది. ఇప్పటివరకూ దేశంలో 94,22,228 మందికి కరోనా వ్యాక్సిన్‌ను అందుకున్నారు. వీరిలో 61.96 లక్షల మంది వైద్య సిబ్బందికి తొలి డోసు తీసుకున్నారు. వైద్యులు, సిబ్బందిలో మిగిలిన 3 లక్షల మందికి రెండో విడతలో టీకా అందజేశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పని చేసిన పారిశుద్ధ్య కార్మికులు, జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులైన 28 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 82 దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా.. ఇప్పటికి దాదాపు 18 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ వేయించినట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version