అండర్ -19 వరల్డ్ కప్ లో ఇండియా బోణీ.. దక్షిణాఫ్రికాపై గ్రాండ్ విక్టరీ

-

అండర్‌ – 19 వరల్డ్‌ కప్‌ లో టీమిండియా దుమ్ములేపింది. మొదటి మ్యాచ్‌ లోనే విజయం సాధించి.. అండర్‌ – 19 వరల్డ్‌ కప్‌ లో బోణీ కొట్టింది టీమిండియా. టీమిండియా నిర్దేశించిన 233 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఛేదించలేకపోయింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. 46.5 ఓవరల్లో 232 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. దక్షిణాఫ్రికా 45.4 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌట్‌ అయింది.

దీంతో టీమిండియా గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. టీమిండియా జట్టు లో కెప్టెన్‌ యాష్‌ ధుల్‌ 82 పరుగులు చేసి… ఇండియాను ఆదుకున్నాడు. అలాగే.. తంబే 35 పరుగులు, రషీద్‌ 31 పరుగులు, నిషాంత 27 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లలో రఘువన్ష్‌ 5, హర్నూర్‌ సింగ్ 1, రాజ్‌ బవా 13 , దినేష్‌ బనా 7, విక్కీ 9 పరుగులు చేశారు. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో బూస్ట్ 3 వికెట్లు, మయాండ 2 వికెట్లు, బ్రెవిస్‌ 2 వికెట్లు, లియామ్‌, మిక్కీ చెరో వికెట్‌ తీసి… పర్వాలేదనిపించారు. ఇక అటు ఇండియా బౌలర్లు దాటిగా బౌల్‌ చేయడంతో విజయం అనివార్యమైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version