రేపటి నుండి ఇండియా మరియు వెస్ట్ ఇండీస్ జట్ల మధ్యన రెండు టెస్ట్ మ్యాచ్ లు, మూడు వన్ డే లు మరియు అయిదు టీ 20 లు జరగనున్నాయి. ముందుగా టెస్ట్ సిరీస్ లో రేపు డొమినికా వేదికగా మొదటి టెస్ట్ జరగనుంది. వరల్డ్ కప్ కు దూరమై బాధలో ఉన్న వెస్ట్ ఇండీస్ జట్టు ఆడనున్న టెస్ట్ సిరీస్ లో విజయమే ప్రధానంగా బరిలోకి దిగనుంది. ఇక ఇండియా సైతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియాతో ఓటమి పాలయ్యి గెలుపు కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. ఈ మ్యాచ్ లో ఇండియా ఆడే తుది జట్టు ఏ విధంగా ఉంటుంది అని అభిమానుకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం రేపు వెస్ట్ ఇండీస్ తో తలపడబోయే ఇండియా జట్టు కింది విధంగా ఉండనుందట.
మరి బీసీసీఐ జట్టు కూర్పును ఇదే విధంగా కొనసాగిస్తుందా లేక ఏమైనా మార్పులు చేస్తుందా తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.