సినిమాలలో ఉద్యోగిని మోసం చేశారని యజమాని లేదా ఎండీ ని కసిపెట్టుకుని హత్య చేయడం చూసే ఉంటారు. అయితే ఇక్కడ నిజజీవితంలోనూ ఇలాంటి ఒక ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు లో జరిగింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఒకప్పుడు ఒక టెక్ కంపెనీ లో పనిచేసి మానేసిన ఉద్యోగి పెలిక్స్ … కారణాలు ఏమో తెలియకపోయినా ఆ కంపెనీ ని చెందిన ఎండీ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను దారుణగా హత్య చేశాడు. ఆఫీస్ సమయంలో నేరుగా లోపలి వచ్చిన మాజీ ఉద్యోగి ఫెలిక్స్… ఇద్దరిపై తాను తీసుకు వెళ్లిన కత్తితో దారుణమ్గా కసితీరా పొడిచాడు.. దీనితో తీవ్రంగా గాయపడిన వీరిద్దరినీ హాసిపిటల్ కు తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ప్రాణాలను వదిలారు. కాగా చనిపోయిన వారిని ఏరోనిక్స్ ఇంటర్నెట్ కంపెనీ కి చెందిన ఎండీ ఫణింద్ర మరియు సీఈఓ విను కుమార్ లుగా పోలీసులు గుర్తించి తెలియచేయడం జరిగింది.