అదరగొట్టిన ఓపెనర్లు… కాని కోహ్లీ మాత్రం…!

-

విశాఖ వేదికగా భారత్ విండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టీం ఇండియా ఓపెనర్లు అదరగొట్టారు… టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన టీం ఇండియాకు ఓపెనర్లు భారి స్కోర్ కి బాటలు వేసారు… ఫోర్లు సిక్సులతో విండీస్ బౌలర్ల మీద విరుచుకుపడ్డారు… రోహిత్ తొలుత నింపాదిగా ఆడినా సరే ఆ తర్వాత మాత్రం దూకుడు పెంచాడు… మరో వైపు రాహుల్… నిదానంగా ఆడుతూనే… ఫోర్లు సిక్సుల తో విరుచుకుపడ్డాడు.

ఇద్దరూ కూడా దొరికిన బంతిని దొరికినట్టు బాదారు. 20 ఓవర్ల వరకు నిదానంగా ఆడిన టీం ఇండియా ఓపెనర్లు… ఆ తర్వాత మాత్రం దూకుడు పెంచారు. మైదానం నలుమూలలా షాట్లు విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ 107 బంతుల్లో 11 ఫోర్లు రెండు సిక్సుల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు… ఆ తర్వాత… రాహుల్ 102 బంతుల్లో… మూడు సిక్సులు 13 ఫోర్ల సాయంతో… సెంచరి చేసాడు.

అయితే స్కోర్ పెంచే క్రమంలో జోసెఫ్ బౌలింగ్ లో… చేజ్ కి క్యాచ్ ఇచ్చి రాహుల్ అవుట్ అయ్యాడు. రాహుల్ తర్వాత వచ్చిన కోహ్లీ… పోలార్డ్ బౌలింగ్ లో… ఖాతా తెరవకుండానే… చేజ్ కి క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం రోహిత్ 120 బంతుల్లో 13 ఫోర్లు, మూడు సిక్సులతో క్రీజ్ లో ఉన్నాడు. శ్రేయాస్ అయ్యర్… రోహిత్ కి జత కలిసాడు… ఓపెనర్లు ఇచ్చిన జోష్ ని… మిడిల్ ఆర్డర్ కొనసాగిస్తే మాత్రం టీం స్కోర్ 350 వరకు వెళ్ళే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version