లండన్ వీధుల్లో “నాటు నాటు” పాటకు డ్యాన్స్ చేసిన 700 మంది మహిళలు

-

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు దుమ్ముదులిపిన నాటు నాటు పాట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇటీవలే ఒరిజినల్ సాంగ్ కేటగిరి లో ఆస్కార్ ను అందుకుంది..గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమాకు క్రేజ్ తగ్గలేదు.. ఇప్పుడు ఆస్కార్ అవార్డు తో మరింత పెరిగింది.

ఈ క్రమంలో ఎందరో నటులు, క్రీడాకారులు, ప్రముఖులు ఈ పాటకు స్టెప్పులేసిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దేశ విదేశాల్లో నాటు నాటు పాటకు క్రేజ్ తగ్గడం లేదు. తాజాగా ఈ పాటకు లండన్ లో మహిళలు స్టెప్పులతో అలరించారు. అదేవిధంగా 700 మంది లండన్ వీధుల్లో స్టెప్పులేస్తూ సందడి చేశారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని లండన్ లోని 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద నాటు నాటు పాటకు మహిళలు ప్రదర్శన ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version