ఒడిశా లోని రూర్కెలాలో జరుగుతున్న హాకీ ప్రపంచ కప్ లో భారత జట్టు శుభారంభం చేసింది. పూల్-డి లో భాగంగా స్పెయిన్ తో జరిగిన మ్యాచ్ లో 2-0 తో విజయం సాధించింది. తోలుత నెమ్మదిగా మ్యాచ్ ను ప్రారంభించిన భారత జట్టు ఆ తర్వాత ప్రత్యర్థి గోల్ పోస్టులపై దాడులు చేస్తూ దూకుడు పెంచింది.
11 వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ ను జర్మన్ ప్రీత్ వృథా చేసినప్పటికీ ఆ తర్వాత దక్కిన మరో పెనాల్టీ కార్నర్ ను టీమిండియా సద్వినియోగం చేసుకుంది. అమిత్ రోహిదాస్ వేగంగా స్పందించి మెరుపు వేగంతో బంతిని గోల్డ్ పోస్టులోకి పంపి భారత్ ఖాతా తెరిచాడు.
ఆ తర్వాత హార్దిక్ సింగ్ గోల్ పోస్టు సమీపంలో బంతిని పాస్ చేశాడు. అది ప్రత్యర్థి ఆటగాడి స్టిక్ కు తగిలి గోల్ పోస్టులోకి వెళ్లడంతో భారత్ ఆదిక్యం 2-0 కి పెరిగింది. మూడో క్వాటర్ లో పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలచడంలో భారత్ విఫలమైంది. ఇంకోవైపు, గోల్స్ కోసం స్పెయిన్ తీవ్రంగా పోరాడిన భారత డిఫెన్స్ ఆటగాళ్లు ఇలాంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో ఇండియా గెలిచింది.