Kamal Birthday: కమల్‌ హాసన్‌కు బర్త్‌డే విషెస్‌తో.. భారతీయుడు 2 పోస్టర్‌ రిలీజ్..

-

విశ్వనాయకుడు కమల్ హాసన్ 68వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. నేడు కమల్‌ హాసన్‌ పుట్టిన రోజు ఇప్పటికే సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. తాజాగా కమల్‌ హాసన్‌ బర్త్ డే సందర్భంగా ఇండియన్‌ 2 నుంచి పోస్టర్‌ రిలీజ్‌ చేస్తూ.. ఆయన బర్త్‌ డే విషెస్‌ చెప్పారు దర్శకుడు శంకర్‌. శంకర్ దర్శకత్వంలో కమల్‌ హాసన్ నటిస్తున్న సినిమా ఇండియన్-2. ఈ సినిమాలో కమల్‌ హాసన్‌కి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. కమల్, శంకర్ కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన ‘ఇండియన్’ మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. తెలుగులో ‘భారతీయుడు’గా ఈ సినిమాని అప్పట్లో విడుదల చేశారు. గత కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం చూస్తున్న కమల్ హాసన్‌కి ఇటీవల విడుదలైన ‘విక్రమ్’ మూవీ బూస్ట్‌ ఇచ్చింది. సరికొత్త మేనరిజంతో ఈ మూవీలో కమల్ కనిపించాడు. దాంతో ఇండియన్-2 మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.

ఇండియన్-2 సినిమాలో విలన్‌గా యోగ్ రాజ్ సింగ్ నటించబోతున్నారు. భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రే ఈ యోగ్ రాజ్ సింగ్. పంజాబ్‌లో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న యోగ్ రాజ్‌ సింగ్ ఇలా పెద్ద హీరో పాన్ ఇండియా మూవీలో కనిపించడం ఇదే తొలిసారి. ఈ మేరకు మేకప్ వేసుకుంటున్న ఓ ఫొటోని యోగ్ రాజ్ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వాస్తవానికి యోగ్ రాజ్ సింగ్ ఇన్నాళ్లు నటుడిగా నెటిజన్లకి పెద్దగా పరిచయం లేదు. కానీ.. 2011 వన్డే ప్రపంచకప్ తర్వాత యువరాజ్ సింగ్ కెరీర్ మసకబారడానికి మహేంద్రసింగ్ ధోనీనే కారణమంటూ తరచూ యోగ్ రాజ్ సింగ్ వార్తల్లో నిలిచేవాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version