ఖలీస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత హస్తం ఉందని ఇటీవల కెనడా ప్రధాని సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో మన విదేశాంగ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. దౌత్య పరంగా ఆ దేశంతో సంబంధాలను తెగదెంపులు చేసుకుంది. తాజాగా నిజ్జర్‌తో సంగతి పక్కన బెడితే.. మరో ఖలీస్తాన్ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారత ఏజెంట్ కుట్ర చేశారని అమెరికా ఆరోపించింది.
పన్నూను హతమార్చేందుకు భారత రా అధికారి కుట్ర చేశారని అమెరికా న్యాయ శాఖ పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ దాడికి యత్నించారని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. పన్నూ హత్యకు కుట్ర జరుగుతోందని, దాని వెనుక భారత మాజీ ఇంటెలిజెన్స్ అధికారి హస్తం ఉందన్నారు.ఆ అధికారిని వికాస్ యాదవ్ (39)గా గుర్తించినట్లు పేర్కొన్నారు.తను ‘రా’ లో పనిచేశాడని చెప్పుకొచ్చారు.అంతేకాకుండా, సదరు భారత రా ఏజెంట్ పన్నూ హత్యతో పాటు మనీ లాండరింగ్ కోసం ప్రయత్నించాడని అమెరికా న్యాయ శాఖ తెలిపింది.