జమ్ముకాశ్మీర్‌లోని పహెల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ బుధవారం అర్ధరాత్రి చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతం అయ్యింది. బవహల్పూర్‌లోని జైష్-ఎ-మహమ్మద్, మురిద్కే కేంద్రంగా ఉన్న లష్కర్-ఎ-తొయిబా క్యాంపులపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జరిపిన దాడుల్లో దాదాపు 90 మంది ఉగ్రవాదులు హతం అయినట్లు భారత్ ప్రాథమికంగా ధృవీకరించింది.
ముఖ్యంగా బవహల్పూర్ జైష్-ఎ-మహమ్మద్ క్యాంపులు, సుభాన్ అల్లా కాంప్లెక్స్‌పై జరిపిన ఎయిర్ స్ట్రైక్‌లో ఆ సంస్థ చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 మందితో పాటు అతని సోదరి, బావమరిది కూడా మరణించినట్లుగా తెలుస్తోంది. కాగా, ‘పిక్చర్ అబీ బాకీ హై’ అని ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ నరవణే ట్వీట్ చేయడం యుద్ధం ఇంకా ముగియలేదని సంకేతాన్ని ఇస్తోంది.