ఫేస్‌బుక్‌ తెరిస్తే కొట్టే ఉద్యోగం..మొహమాటం లేకుండా చితకబాదిన ఉద్యోగి..!

-

ఈరోజుల్లో చిత్ర విచిత్రమైన ఉద్యోగాలు చాలా ఉంటున్నాయి. విదేశాల్లో ఓ కంపెనీ తాము పంపే పరుపులపై పడుకొని వాటిపై రివ్యూ ఇచ్చే ఉద్యోగం ఇచ్చింది. మరో కంపెనీ తాము పంపే చెప్పుల్ని వాడి అవి ఎలా ఉన్నాయో రిపోర్ట్ ఇచ్చే ఉద్యోగం ఇచ్చింది. మరో కంపెనీ సీసీటీవీ ఫుటేజ్‌ని చూసే ఉద్యోగం ఇచ్చింది. ఇప్పుడు కూడా అలాంటి మరో ఆసక్తికర, ఆశ్చర్యకర ఉద్యోగం ఇంకోటి వచ్చింది. ఇదీ వీటన్నింటికి కొంచెం భిన్నమైనదే..ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తే చెంపపగలకొట్టే జాబ్. భలే విచిత్రంగా ఉంది కదూ..అసలు ఇది ఎందుకు పెట్టారో ఇప్పుడు చూద్దాం.

ఇండియన్-అమెరికా బ్లాగర్ ఈ ఉద్యోగం ఇచ్చారు అయితే ఇప్పుడు కాదు ఎప్పుడో 2012లో. ఆయన పేరు మనీష్ సేథీ చాలా మందిలాగే ఆయనకూ ఫేస్‌బుక్ వాడే అలవాటు ఎక్కువైంది. అది చివరకు వ్యసనంలా తయారైంది. పని మానేసి ఫేస్‌బుక్‌లో మునిగి తేలసాగాడు. దాంతో నెల నెలా పనులు పెండింగ్ అవుతున్నాయి. ఏం చేసినా ఆ వ్యసనం నుంచి బయటపడలేకపోయాడట.. ఇక లాభం లేదని ఓ అమ్మాయిని నియమించుకున్నాడు. ఆమె పని ఏంటంటే అతన్ని గమనిస్తూ ఉండాలి. ఆఫీసులోగానీ… ఇంట్లోగానీ ఫేస్‌బుక్ ఓపెన్ చెస్తే చాలు చెంప చెళ్లుమనిపించాలి. అది మూసేసే వరకూ కొడుతూనే ఉండాలి. యజమాని అని మర్యాద ఇవ్వక్కర్లేదు..మొహమాట లేకుండా మొఖంపగలకొట్టొచ్చు. ఆ దెబ్బలు తినలేక ఆయన ఫేస్‌బుక్ క్లోజ్ చెయ్యాలి. ఇదీ ఆమె పని. ఇది నిజంగానే జరిగింది.

క్రైగ్స్‌లిస్టులో ఈ జాబ్ కోసం మనీష్ ప్రకటన వేసినప్పుడు గంటలోనే 20 మంది అప్లై చేశారట..ఆయన ఓ అమ్మాయిని నియమించుకున్నాడు. ఆయనేమీ చిన్న ఉద్యోగి కాదు. వేరబుల్ డివైజ్ కంపెనీ పావ్లాక్ సీఈఓ. ఆ స్థాయి వ్యక్తికి కూడా ఈ ఫేస్‌బుక్ తలనొప్పిగా మారిందన్నమాట.ఇప్పుడు ఎందుకు బయటపడిందంటే.. ఈ విషయాన్ని ఆయనే తాజాగా బ్లాగ్ ద్వారా తెలిపాడు.

ఉద్యోగి పేరు కారా. ఆమెకు శాలరీ గంటకు $8 (రూ.600). అంటే రోజుకు 8 గంటలు పని… ఆమెకు నెలకు ఇచ్చే శాలరీ రూ.1,44,000. అదిరిపోయే శాలరీ, ఫన్నీ ఉద్యోగం. ఇందులో చేరాక ఆమె ఏమాత్రం మొహమాటం లేకుండా చితకబాదిందట. దాంతో మనీష్‌కి ఫేస్‌బుక్ మత్తు వదిలింది. ఆమె కొట్టే దెబ్బలు భరించలేక ఆయన ఫేస్‌బుక్ తెరవాలంటేనే భయపడటం మొదలుపెట్టాడట. క్రమంగా ఆయన పనిలో వేగం పెరిగింది. 35 నుంచి 40 శాతం చేసే పని… ఏకంగా 98 శాతం పెరిగిందట. అంటే ఆయన ఏ రేంజో ఫేస్‌బుక్ కి అలవాటైపోయాడో కదా.

కారా కొట్టడమే కాదు మనీష్ సేథీ ఎప్పుడెప్పుడు ఏయే పనులు పూర్తి చెయ్యాలో కూడా గుర్తు చేసింది. చెప్పాలంటే ఓ బాస్‌లా మారింది. అది ఆయనకు నచ్చిందట. ఎందుకంటే అల్టిమేట్‌గా పనైపోవాలి. ప్రొడక్టివిటీ పెరగాలి అనుకున్నాడు. ఆయన అనుకున్నది జరిగింది..ఆ ఫలితం దక్కింది.

కారా..మనీష్‌ని కొడుతున్నట్లు ఉన్న ఓ ఫొటో రీసెంట్‌గా ఆన్‌లైన్‌లో కనపించింది. అది టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ కంటపడింది. ఆయన రెండు ఫైర్ ఇమోజీలతో రెస్పాండ్ అయ్యారు. అది చూసి మనీష్ చాలా ఆనందపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version