ప్రపంచంలోని పదవ ఎత్తైన శిఖరం యొక్క క్యాంప్ III నుండి పదిహేడవ తేదీ మధ్యాహ్నం క్యాంప్ IV నుండి తిరిగి వస్తున్నా సమయంలో ఒక భారతీయ అధిరోహకుడు తప్పిపోయాడు. వివరాల లోకి వెళితే.. సెవెన్ సమ్మిట్ ట్రెక్స్‌లో ఛైర్మన్ మింగ్మా షెర్పా ప్రకారం రాజస్థాన్‌లోని కిషన్‌ఘర్గ్‌కు చెందిన అనురాగ్ మాలూ, 34, క్యాంప్ III నుండి తిరిగాడు. కానీ దురదృష్టవుశాత్తు సుమారు 6,000 మీటర్ల నుండి కింద పడిపోవడంతో అదృశ్యమయ్యాడు.
అతన్ని కనుగొనడానికి వైమానిక శోధన నిర్వహించబడింది అని షెర్పా చెప్పారు. అయితే అతని పరిస్థితి గురించి మాత్రం ఇంకా తెలియలేదు. క్యాంప్ IV చేరుకున్న తర్వాత అనురాగ్ కనపడలేదు. తప్పిపోయాడని తెలుస్తోంది. 8000మీ పైన ఉన్న మొత్తం 14 శిఖరాలను అధిరోహించే లక్ష్యంతో అనురాగ్ వున్నదని తెలుస్తోంది.
UN గ్లోబల్ గోల్స్ ని సాధించే దిశగా అవగాహన కల్పించడానికి అలానే చర్యను నడపడానికి ఏడు శిఖరాగ్రాలను అధిరోహించాడు. REX కరమ్‌వీర్ చక్రను కూడా అనురాగ్ పొందాడు. అంతే కాదు భారతదేశం నుండి 2041 అంటార్కిటిక్ యూత్ అంబాసిడర్ అయ్యాడు కూడా.