కాలిఫోర్నియా లో అనుమానాస్పద స్థితి లో మృతి చెందిన భారతీయ కుటుంబం..!

-

అమెరికాలోని కాలిఫోర్నియా షాన్ మాటెయ్ లో ఒక భారతీయ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అలమెడ లాస్ పులగాస్ అనే ప్రాంతంలో బ్లాక్ నెంబర్ 4100 లో ఇది చోటుచేసుకుంది కేరళకి చెందిన ఆనంద్ సుజాత హెన్రీ 42 భార్య అలీస్ బెంజిగర్, నాలుగేళ్ల వయసు ఉన్న ఇద్దరు పిల్లలు ని మృతదేహాలని గుర్తించారు కుటుంబ కలహాలే ఇందుకు కారణం అని తెలుస్తోంది.

వెల్ఫేర్ చెక్ సమయంలో ఈ ఇంటి నుండి ఎటువంటి స్పందన రాలేదు స్థానికులు అధికారులకు సమాచారాన్ని ఇచ్చారు. ఆ ఇంట్లోకి వెళ్తే అన్ని తలుపులు మూసేసి ఉన్నాయి ఒక కిటికీ తెరిచి ఉండడంతో అధికారులు అందులో నుండి లోపలికి వెళ్లారు బాత్రూంలో దంపతులు మృతదేహాలు కనపడ్డాయి. వీరి శరీరంపై తుపాకీతో కాల్చిన గాయాలు ఉన్నాయి సమీపంలో ఒక నైన్ ఎంఎం తుపాకీ తూటాలని స్వాధీనం చేసుకున్నారు పడకగదిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి శరీరం మీద ఎలాంటి గాయాలు లేవు చిన్నారుల మీద విష ప్రయోగం వంటివి చేసి ఉండొచ్చని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version