కెనడా పార్లమెంట్ లో కరోనా కలకలం… భారతసంతతి ఎంపీ కి!

-

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 4 లక్షలపైగా ప్రజలు పాజిటివ్ తేలడం తో ఆసుపత్రులలో వైద్యం పొందుతున్నారు. కెనడా లో కూడా ఈ మహమ్మారి విజృంభిస్తుండడం తో ఈ సమయంలో ప్రభుత్వాలకు అండగా ఉంటూ, వైద్యసాయం చేయడానికి చాలామంది మాజీ డాక్టర్లు రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది. అయితే వారిలో భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ కమల్ ఖేరా కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే కరోనా బాధితులకు సాయం అందించాలి అని అనుకున్న ఆమెకే దురదృష్టవశాత్తు కరోనా సోకింది. కెనడా పార్లమెంటు సభ్యుల్లో కరోనా సోకిన తొలి వ్యక్తి ఆమె. ఈ విషయం తెలుసుకున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడా స్పందించారు. ‘ఆరోగ్యం జాగ్రత్త కమల్.. మేమంతా నీ గురించే ఆలోచిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ట్రూడా ప్రభుత్వంలో పార్లమెంట్ సెక్రెటరీగా కమల్ సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. తన అధికారిక ఫేస్ బుక్ పేజీలో విడుదల చేసిన ఒక ప్రకటనలో కమల్ ఈ విషయం వెల్లడించారు. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు ఫ్లూ లాంటి లక్షణాలు గుర్తించి వెంటనే స్వీయ నిర్బంధం లోకి వెళ్లినట్లు తెలిపారు.

నన్ను సోమవారం ఉదయం బ్రాంప్టన్‌లోని పీల్ మెమోరియల్ సెంటర్‌లో కోవిడ్ -19 పరీక్షలు నిర్వహించారని, గత రాత్రే కరోనా పరీక్షల ఫలితాలు వచ్చాయని, పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు ఆమె వెల్లడించారు. కమల్ ఖేరా 2015 లో తొలిసారిగా కెనడా లోని బ్రాంప్టన్ వెస్ట్ నుండి ఎంపిగా ఎన్నికవ్వగా, 2019 ఎన్నికలలో తన స్థానాన్ని నిలుపుకున్నారు. ఆమె రిజిస్టర్డ్ నర్సు మరియు మొదటి తరం కెనడియన్.పంజాబ్ మూలాలు ఉన్నప్పటికీ కమల్ ఢిల్లీ నుంచి కెనడా కు వలసవెళ్లినట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version