ఇలానే కొనసాగితే ఇటలీ లాగే విలయతాండవమే అంటున్న నిపుణులు

-

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా భారత్ లో కూడా తన ప్రతాపాన్ని చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు 21 రోజుల పాటు లాక్ డౌన్ చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు కూడా. అయితే భారత్ ఇంతగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ రోజు రోజుకు ఈ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 694 కి చేరగా,గురువారం కరోనా సోకి ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తుంది. దీనితో మొత్తం దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 16 కి చేరినట్లు తెలుస్తుంది. అయితే ఈ సంఖ్య ఇలానే పెరుగుకుంటూ పొతే మాత్రం ఇక మే నెల రెండో వారం ముగిసేసరికి భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13 లక్షలకు చేరుకొనే అవకాశం ఉందంటూ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే… కరోనా దెబ్బకు మొదటి దశలోనే కుదేలైన ఇటలీ, అమెరికాలతో పోలిస్తే కరోనాను కట్టడి చేయడంలో భారత్ చాలా జాగ్రత్త వహించింది అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఒక్క విషయంలో మాత్రం భారత్ బోర్లా పడింది అని, ఎంతమంది నిజంగా ఈ కరోనా బారిన పడ్డారో అన్న విషయం గుర్తించడం లో భారత్ లెక్క తప్పింది అంటూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్ భారత్‌లో వ్యాప్తి చెందుతున్న స్థాయిని చూస్తుంటే వైరస్ కట్టడికి ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

అంతేకాకుండా భారత్‌లో వైద్య సదుపాయాలు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని.. పెరగనున్న పాజిటివ్ కేసులతో పోలిస్తే బెడ్స్ సంఖ్య అత్యంత స్వల్పంగా ఉందని నిపుణులు తెలిపారు. ఏది ఏమైనా గానీ ఈ కరోనా మహమ్మారి ఇలానే కొనసాగితే మాత్రం భారత్ లో కూడా ఇటలీ లో లాగా విలయతాండవం చేయడం ఖాయమే అని నిపుణులు తేల్చి చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version