గుడ్ న్యూస్: ఏప్రిల్ నుండి అన్ని ట్రైన్స్ పట్టాలెక్కనున్నాయి…!

-

ఇండియన్ రైల్వేస్ కోవిడ్ 19 కారణంగా గత ఏడాది మార్చి లో ట్రైన్ సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసినదే. ఆ తరవాత కొద్దీ రోజుల వరకు రైళ్లు తిరగలేదు. కొన్ని నెలలు అయ్యాక ట్రైన్ సర్వీసులను ప్రారంభిస్తూ వస్తోంది. కేవలం స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది. అయితే ఇప్పటికీ కూడా ట్రైన్ సర్వీసులు పూర్తి స్థాయి లో అందుబాటు లోకి రాలేదు. కానీ ఇప్పుడు ఏప్రిల్ నుండి అన్ని ట్రైన్స్ ని తీసుకు రానున్నారు.

ట్రైన్ సర్వీసులు కనుక పూర్తి స్థాయి లో అందుబాటు లోకి వస్తే ప్రయాణికులకు ఏ ఇబ్బంది ఉండదు. ఏప్రిల్ నుంచి ఇండియన్ రైల్వేస్ అన్ని ట్రైన్స్‌ను పట్టాలెక్కిస్తే…. ట్రైన్ ప్యాసింజర్లు కి ఊరట కలుగుతుంది. ఇండియన్ రైల్వేస్ ఏప్రిల్ 1 నుంచి అన్ని ప్యాసింజర్ ట్రైన్స్‌ను పట్టాలెక్కించనుందని నివేదికలు వెలువడుతున్నాయి. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం 65 శాతం వరకు ట్రైన్స్ మాత్రమే నడుస్తున్నాయి.

ఇప్పుడు మళ్లీ ట్రైన్ సర్వీసులను పూర్తి స్థాయి లో అందుబాటు లోకి తీసుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. రానున్న రోజుల్లో పూర్తి స్థాయి లో ట్రైన్ సర్వీసులు అందుబాటులోకి రావొచ్చు. అలానే ట్రైన్ సర్వీసులను పూర్తి స్థాయి లో తిరిగి తీసుకుని రావడానికి పరిశ్రమ వర్గాలకు చెందిన అందరి సూచనలు తీసుకుంటున్నట్టు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version