భారత్ లాంటి దేశాల్లో ఐటి ఉద్యోగాలకు ఏ స్థాయిలో ప్రాధాన్యత ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. ఐటి ఉద్యోగాన్ని భారతీయులు ఒక పరువుగా కూడా భావిస్తూ ఉంటారు. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. యువత ఎక్కువగా ఈ ఐటి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వడానికి ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు. ఐటి ఉద్యోగాల ద్వారా ఆదాయ౦ ఎక్కువగా ఉండటంతో యువత వాటి మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఆ ఉద్యోగాల కోసం ప్రత్యేక కోర్సులు కూడా శిక్షణ తీసుకుంటుంది యువత.
అయితే ఇప్పుడు ఈ ఉద్యోగాలు అంటే చాలు భారతీయులు భయపడిపోతున్నారు. ఐటి ఉద్యోగుల భార్యలు ఐటి ఉద్యోగాలు అంటే చాలు వణికిపోతున్నారు. ఐటి ఉద్యోగాల్లో కష్టం ఎక్కువ అనేది అందరికి తెలిసిందే. ఎక్కువ సమయం దాని మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇక కంపెనీలు ఎప్పుడు షిఫ్ట్ ఇస్తే అప్పుడు చెయ్యాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీలు అయితే ఉద్యోగుల మీద పని ఒత్తిడి కూడా ఎక్కువగానే పెడుతున్నాయి. ఆఫీసులకు వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత కూడా ఉద్యోగులు పని ఒత్తిడితో ఎక్కువగా నలిగిపోతున్నారు.
ఈ క్రమంలో కుటుంబ జీవనంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగులు. భార్యలను, పిల్లలను కనీసం పట్టించుకోవడం లేదట ఉద్యోగులు. ముఖ్యంగా హైదరాబాద్ లో అక్రమ సంబంధాలకు ఐటి ఉద్యోగాలే కారణమని ఇటీవల పోలీసులు కూడా వెల్లడించారు. ఉదయం అంతా ఆఫీస్ లో అలసిపోయి రావడం ఇంటికి వచ్చిన తర్వాత ఏకాంతంగా ఉండాలి అనుకోవడం, పిల్లలతో కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా చేయకపోవడం, భార్యలను దగ్గరకు రానీయకపోవడం, వాళ్ళు మాట్లాడుతుంటే చిరాకు పడటం వంటివి ఉద్యోగులు చేస్తున్నారట.
దీనితో భార్యలు, భర్తలను ఐటి ఉద్యోగాలు వద్దని, ఉన్న ఆస్తులు అమ్ముకుని అయినా సరే బ్రతుకుదాం, ఇతర వ్యాపారాలు చేసుకుందాం అని కోరుతున్నారట. ఇక చాలా మంది విడాకులకు కూడా ఇవే కారణంగా మారుతున్నాయని ఒక సర్వేలో కూడా వెల్లడైంది. ఐటి ఉద్యోగుల్లో చాలా కుటుంబాలు ఆర్ధికంగా బలంగా ఉన్నా సరే… కుటుంబం పరంగా చాలా బలహీనంగా ఉన్నారని అందుకే ఉద్యోగాలు వద్దని, ఇతర ఉద్యోగాలు చూసుకోవాలని కోరుతున్నారట. హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని అంటున్నారు.