సెంచూరియన్ టెస్ట్ లో ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. సౌతాఫ్రికా జట్టు పై ఏకంగా.. 113 పరుగుల తేడాతో టీమిండియా అఖండ విజయాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో.. సౌతాఫ్రికా జట్టును… కేవలం 191 పరుగులకే ఆల్ అవుట్ చేసి… 113 పరుగుల తేడాతో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది.
ఐదో రోజు లంచ్ బ్రేక్ విరామానికి 66 ఓవరల్లో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా జట్టు.. ఆ తర్వాత వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. ఓవర్ నైట్ స్కోర్ 94-4 వద్ద ఐదో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాప్రికా జట్టు.. విజయమే లక్ష్యంగా.. ఫస్ట్ సెషన్ లో బ్యాటింగ్ కొనసాగించింది. ఈ నేపథ్యంలోనే.. ప్రమాదకరంగా మారుతున్న డీన్ ఎల్గర్ ను జస్ప్రిత్ బుమ్రా పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత వికెట్లు ఫాస్ట్ గా పడటంతో… ఇండియా విజయం సాధించింది.కాగా.. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 327, రెండో ఇన్నింగ్స్ లో 174 పరుగులు చేయగా… దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 197 పరుగులు చేసింది.