కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వస్తూనే వుంది. ఈ స్కీమ్స్ వలన ఎన్నో రకాల లాభాలు పొందొచ్చు. ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కొన్ని రకాల స్కీమ్స్ ని ప్రవేశ పెట్టింది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులను తీసుకు వచ్చింది. అందుకని కష్టాలు తొలగించడానికి స్కీమ్స్ ని తీసుకు రావడం జరిగింది.
ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ వలన కేంద్రం వైద్య కార్మికుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల వరకు పరిహారం అందిస్తోంది.
అదే విధంగా 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న యువ రచయితల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ పధకాన్ని తీసుకు వస్తోంది. ఈ స్కీమ్ పేరు పీఎం మెంటరింగ్ యువ పథకం. ఈ స్కీమ్ తో కల్పన, నాన్-ఫిక్షన్, మెమోయిర్స్, డ్రామా, కవిత్వం విభాగాలలో నైపుణ్యం సాధించిన వాళ్లకు సహాయం అందుతుంది.
అలానే కేంద్ర ప్రభుత్వం 10 రూపాయలకు ఎల్.ఈ.డీ బల్బులను అందిస్తోంది. గ్రామ్ ఉజ్వల పథకం పేరుతో కేంద్రం దీనిని తీసుకు వచ్చింది. ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందిస్తుండటం గమనార్హం. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో రైల్ కౌశల్ వికాస్ యోజన స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా కేంద్రం యువతకు నైపుణ్యాలను అందిస్తోంది.
భారతీయ రైల్వే శిక్షణా సంస్థల ద్వారా కేంద్రం యువతకు శిక్షణ అందిస్తోంది. పీఎం దక్ష్ యోజన స్కీమ్ ద్వారా షెడ్యూల్డ్ కులాలు, సఫాయి కార్మికులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ-శ్రమ్ పోర్టల్, పీఎం ఉమీద్ స్కీమ్, అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ స్కీమ్ లను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.