తెలంగాణ రాష్ట్రంలో.. జనవరి 4 వ తేదీ వరకు ఆంక్షలు విధించాలని కేసీఆర్ సర్కార్ కు టీఎస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇళ్ళ మధ్యలో పబ్బుల ఏర్పాటు పై హైకోర్టు కీలక వ్యాఖ్యాలు చేసింది. హైదరాబాద్ పోలుసులు ఊహించిన దాని కంటే ఎక్కువగానే చర్యలు తీసుకున్నట్లు అభిప్రాయపడ్డ హైకోర్టు.. పబ్బుల ముందు హెచ్చరిక బోర్డ్ లు ఏర్పాటు చేయాలని పబ్బులు నిర్వాహకులు ఆదేశించింది.
తాగి వాహనం నడిపితే పబ్బు నిర్వాహకులదే బాధ్యతన్న హైకోర్టు.. పోలీసులు ఆంక్షలు 4 తేదీ ఉదయం వరకు అమలు పరచాలని పోలీసులను ఆదేశించింది. 45 డేసిబుల్స్ కి శబ్ద కాలుష్యం మించరాదని.. ఎక్సైజ్ శాఖను కూడా ప్రతి వాదులుగా చేర్చాలని పేర్కొంది. పబ్బులకు వెళ్లే జంటలతో పాటు వచ్చే మైనర్లకు అనుమతి నిరాకరించింది. పేరెంట్స్ తో పాటు వచ్చిన మైనర్‌లను అనుమతించొద్దని… వేడుకల పై హైకోర్టు ఆదేశాలు, సుప్రిం కోర్టు మార్గదర్శకాలు అమలు పరుస్తూ పోలీస్ గైడ్ లైన్స్ ను పాటించాలని ఆదేశించింది. తదుపరి విచారణలో హైకోర్టు కు అందే నివేదికల ఆధారంగా విచారణ చేద్దామని పేర్కొంది హైకోర్టు.