టీమిండియా న్యూజిలాండ్ జట్ల మధ్య బుధ వారం రాత్రి జరిగన మ్యాచ్ ఉత్కంఠ సాగింది. చివరి రెండు ఓవర్లు మాత్రం నరాలు తెగెలా ఉత్కంఠభరితంగా మారింది. చివరి రెండు ఓవర్ల లోనే రెండు వికెట్లు కొల్పొయింది. అలాగే ఐపీఎల్ హీరో వెంకటేష్ అయ్యర్ కు తన మార్క్ అటను చూపులేక పోయాడు. చివరకు వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఫోర్ కొట్టి ఉత్కంఠ కు తెర దించి భారత్ కు విజయాన్ని అందించాడు. అయితే ముందుగా న్యూజిలాండ్ అందిచిన 165 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. ఓపెనర్లు కెఎల్ రాహుల్ 15 (14) తో పాటు రోహిత్ శర్మ 48 (36) తో తొలి వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని ఇచ్చారు.
రాహుల్ అవుట్ అయిన తర్వాత యువ సంచలనం సూర్య కుమార్ యాదవ్ 62 (40) తో బ్యాట్ ఝులిపించాడు. దీంతో భారత్ స్కోర్ బోర్డు 100 మార్క దాటింది. రోహిత్ , సూర్య లు కూడా రెండో వికెట్ భాగస్వామ్యానికి 59 పరుగులు జోడించారు. తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్ద గా రాణించలేదు. దీంతో చివరి రెండు ఓవర్లలో మ్యాచ్ విజయం పై నీలి నిడలు కమ్మాయి. అయితే రిషబ్ పంత్ చివర్లో ఫోర్ కొట్టడం తో రెండు బంతులు మిగిలి ఉండ గానే టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన సూర్య కుమార్ యాదవ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.