జైపూర్ వేదికగా టీమిండియా న్యూజిలాండ్ కు జరిగిన మొదటి టీ ట్వంటి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. ఈ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన అతిథ్య న్యూజి లాండ్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 164 పరుగలు చేసింది. న్యూజిలాండ్ ఓపెనర్ డారిల్ మిచెల్ కు ఆరంభం లో నే భూవనేశ్వర్ షాక్ ఇచ్చాడు. భూవనేశ్వర్ తన మొదటి ఓవర్ లోని మూడో బంతికే డారిల్ మిచెల్ ను గోల్డెన్ డకౌట్ గా పెవీలియన్ కు పంపించాడు. తర్వాత మార్టీన్ గప్టిల్ 70(42) మార్క చాప్మల్ 63 (50) దాటి గా ఆడటం తో న్యూజి లాండ్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.
వీరు ఇద్దరు అవుట్ అయిన తర్వాత న్యూజిలాండ్ ఆటగాళ్లు పెద్దగా రాణించ లేదు. టీమిండియా నుంచి పేసర్ భూవనేశ్వర్ కుమార్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తల రెండు వికెట్లు తీశారు. అలాగే దీపక్ చాహార్, మహ్మద్ సిరాజ్ తల ఒక వికెట్ తీశారు. దీంతో న్యూజిలాండ్ జట్టు 6 వికెట్లు నష్ట పోయి 164 పరుగుల చేసింది. దీంతో టీమిండియా ముందు 165 పరుగుల లక్ష్యం ఉంది. కాగ ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ మంచి ఆరంభం అందిస్తే టీమిండియా అలవకగా విజయం సాధిస్తుంది.