లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నాయకులు ఒక పార్టీ నుండి మరొక పార్టీలోకి జంప్ అవుతున్న విషయం తెలిసిందే.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రభుత్వాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీని కీలక నేతలు ఒక్కొక్కరిగా వీడుతున్నారు.తాజాగా ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
ఈ క్రమంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కాగా, ఆయన ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన బీఆర్ఎస్‌ను వీడుతున్నట్లు పలుమార్లు వార్తలు వినిపిస్తున్నా వేళ.. ఎట్టకేలకు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సంబంధించిన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పంపారు.