ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము యొక్క ఈరోజు హుండీ లెక్కింపు ఈరోజు 3 కోట్లు దాటిపోయింది. మొత్తం నగదు 3,22,45,920 రూపాలు అయితే కానుకల రూపములో 618 గ్రాముల బంగారం.. 6 కేజీల 28 గ్రాములు వెండి వచ్చింది. ఇక విదేశీ కరెన్సీ చూస్తే 773 USA డాలర్లు, 125 ఆస్ట్రేలియా డాలర్లు, 30 సౌదీ రియాల్స్, 5 యూరప్ యూరోలు, 35 UAE దిర్హమ్స్, 205 కెనడా డాలర్లు, 14 సింగపూర్ డాలర్లు, 93 మలేషియా రింగేట్లు, 120 థాయిలాండ్ భాట్, 15 ఇంగ్లాండ్ పౌండ్లు, 10 స్కోట్లాండ్ పౌండ్లు, 10 న్యూజిలాండ్ డాలర్లు, 10 హంకాంగ్ డాలర్లు, 50 ఖతర్ రియబ్ లు, 400 ఒమన్ బైసా, 0.5 కువైట్ దినార్ లు వచ్చాయి.
ఇక ఈరోజు హుండీ లెక్కింపులో ఆలయ ఈవో కె రామచంద్ర మోహన్ గారు, డీప్యూటీ ఈవో ఎమ్.రత్న రాజు గారు, దేవాదాయ శాఖ అధికారులు, ఏఈఓ లు మరియు ఆలయ సిబ్బంది, SPF మరియు I-టౌన్ పోలీసు సిబ్బంది, అమ్మవారి సేవా దారులు పాల్గొన్నారు.