డైలీ మార్కెట్ లో ఏదో ఒక స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. పదిలో ఒకటి చూసుకోమంటే మనకు తేలిక అవుతుంది కానీ.. ఇప్పుడు ఆప్షన్స్ పదుల్లో కాదు.. వందల్లో ఉన్నాయి. ఒక దాన్ని మించి ఒకటి ఉంటున్నాయి. మీ బడ్జెట్ ఎంతైనా..ఆ రేంజ్ మంచి ఫోన్స్ వచ్చేస్తున్నాయి. ప్రజెంట్ భారత్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ ఉంది. కాస్ట్లీ ఫోన్లు పదిలో ఇద్దరు తీసుకుంటే.. మిగిలినవారంతా బడ్జెట్ ఫోన్లకే మొగ్గు చూపుతున్నారు. తక్కవ ధరలో బెస్ట్ ఫీచర్స్ ఇంకే కావాలి.. తాజాగా.. ఇన్‌ఫినిక్స్ కూడా.. తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను లాంఛ్ చేసేందుకు రెడీ అయిపోయింది. Infinix Hot 11 2022 స్మార్ట్ ఫోన్స్ సేల్స్ ఈ నెల 15 న ప్రారంభం కానున్నాయి. మరీ ఈ ఫోన్ ఫీచర్స్, కాస్ట్ ఏంటో చూసేద్దామా..!
ఈ ఫోన్ అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్ ద్వారా జరగనున్నాయి. ఇన్‌ఫినిక్స్ కంపెనీ ఫోన్ వివరాలను ఇప్పటికీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే దీని గురించి తాజా అప్‌డేట్స్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా ఫ్లిప్‌కార్ట్ టీజ్ చేసింది. ఆ వివరాలను బట్టీ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి..
ఈ డివైజ్ లాంచింగ్‌కు ముందు ఇన్‌ఫినిక్స్ హాట్ 11 2022 మొబైల్ స్పెసిఫికేషన్‌లను టీజ్ చేసింది. Infinix Hot 11 2022 స్పెసిఫికేషన్‌లు భారతదేశ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లోనే ఉంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Infinix Hot 11 2022 హైలెట్స్..
Infinix Hot 11 2022 అరోరా గ్రీన్, పోలార్ బ్లాక్, సన్‌సెట్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.
హాట్ 11 2022 డివైజ్ 6.7 అంగుళాల FHD+ IPS LCD ప్యానెల్‌ను కలిగి ఉంటుంది.
స్క్రీన్ 550 నిట్స్ బ్రైట్‌నెస్, 114 శాతం sRGB కలర్ కవరేజీని అందించగలదని కంపెనీ చెబుతోంది.
ఈ ఫోన్‌లో 89.5 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, సెల్ఫీ కెమెరా కోసం హోల్-పంచ్ కటౌట్ ఉంటుంది.
హాట్ 11 2022 స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో.. రెక్టాంగులర్ ఐలాండ్‌లో స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్ ఉంది.
కెమెరా ఐలాండ్‌లో డ్యుయల్ కెమెరా సెటప్, LED ఫ్లాష్ ఉన్నాయి. 48MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాతో ఈ మోడల్ రిలీజ్ కానుంది.
Infinix Hot 11 2022 ఫోన్‌కు కుడి వైపున ఫింగర్‌ప్రింట్ రీడర్, వాల్యూమ్ రాకర్ వంటివి ఉన్నాయి.
హాట్ 11 2022 ఫోన్ 5,000 mAh సామర్థ్యం ఉన్న బ్యాటరీతో వస్తుంది.
ఇది USB టైప్-C పోర్ట్ ద్వారా ఛార్జ్ అవుతుంది.
ఈ ఫోన్ వెనుక భాగంలో ‘మ్యాజిక్ ట్రైల్స్ ప్యాటర్న్’ డిజైన్ ఉంటుందని ఇన్‌ఫినిక్స్ పేర్కొంది.
అయితే ఇన్‌పినిక్స్ హాట్ 11 2022 మోడల్ ధర, ఇతర ఫీచర్ల గురించి మరిన్ని వివరాలను త్వరలోనే కంపెనీ అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. రూ. 10 వేల లోపు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.