కరీంనగర్ లో వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. రోడ్డు పైన నేను ఏది ధరించక పోయినా, అన్నింటికీ ఫైన్ కడుతున్నానని రోడ్డుపైనే కూర్చున్నాడు. అసలు రోడ్లే సరిగా లేవు, మరి మీరు నాకెంత ఫైన్ కడతారు అంటూ ప్లకార్డుతో నిరసన కూడా తెలిపాడ్లు ఈ కరీంనగర్ వాసి.
ఈ సంఫటన వివరాలు ఇలా ఉన్నాయ్. కరీంనగర్ – రేకుర్తి చౌరస్థలో గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు అద్వానంగా ఉందని.. కరీంనగర్ – నిజామాబాద్ నేషనల్ హైవే అయినప్పటికీ అధికారులు గాని పొలిటికల్ లీడర్స్ గాని ఎవరూ పట్టించుకోవడం లేదని కోట శ్యామ్ కుమార్ అనే వ్యక్తి నిరసన తెలిపాడు. రోడ్డు పైన నేను ఏది ధరించక పోయినా అన్నింటికీ ఫైన్, GSTలు, రోడ్డు టాక్స్ కడుతున్నాను అంటూ ఆగ్రహించాడు. కానీ అసలు రోడ్లే సరిగా లేవు.. మరి మీరు నాకెంత ఫైన్ కడతారు అని కరీంనగర్ కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్ గారిని ప్రశ్నిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగాడు.
A man sat on the road stating:
Respected Commissioner of Police &District Collector,
You are fining us for everything – even if I don’t wear something properly while on the road
But the roads themselves are not in proper condition.
So how much fine will you impose on me for that? pic.twitter.com/k1SMgAqvrw— Public_Voice_Warangal (@Voice_WGL) September 3, 2025