నేడు ఏపీ కేబినెట్ మీటింగ్ జరుగనుంది. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. అమరావతికి సంబంధించి ఇటీవల జరిగిన SIPB, CRDA సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించనున్న కేబినెట్… రాజధానిలో భూసేకరణ జరిపేందుకు CRDAకు పాలనపరమైన అనుమతులు మంజూరు చేయనుంది.
రూ.53 వేల కోట్ల పెట్టబడులు, 83 వేల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పలు పరిశ్రమలకు అనుమతులు ఇవ్వనున్న కేబినెట్… ఈ నెల 18 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల షె డ్యూల్ పై చర్చించనుంది. ఇక అటు ఏపీలో 3 నెలల ముందే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయా లని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు ఇచ్చింది. అక్టోబర్ 15లోగా వార్డుల విభజన పూర్తి చేయాలన్న ఈసీ… ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది. నవంబర్ 30లోగా పోలింగ్ కేంద్రాలు, డిసెంబర్ 15లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.