దీపాదాస్ మున్షీ పిటిషన్ పై విచారణ వాయిదా..!

-

తెలంగాణ బీజేపీ ఉపాధ్యక్షుడు NVSS ప్రభాకర్ గతంలో చేసిన ఆరోపణలపై ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ దాఖలు చేసిన పరువు నష్టం కేసు పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. డిసెంబర్ 05కి నాంపల్లి క్రిమినల్ కోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఇవాళ విచారణకు దీపాదాస్ మున్షీతో పాటు NVSS ప్రభాకర్ కూడా హాజరయ్యారు. ఈ కేసులో ప్రభాకర్ పలుసార్లు కోర్టుకు హాజరు కాకపోవడం పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇవాళ విచారణకు తప్పక హాజరు కావాలని కోర్టు గతంలోనే ఆదేశించింది. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇవాళ విచారణకు ప్రభాకర్ హాజరయ్యారు. విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్ 05 కి వాయిదా వేసింది. గత లోక్ సభ ఎన్నికల సమయంలో దీపాదాస్ మున్షీ పై NVSS ప్రభాకర్ పలు ఆరోపణలు చేశారు. ముడుపులు తీసుకొని ఎంపీ టికెట్లు ఇప్పించారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version