Shamshabad: హైదరాబాద్‌ లో మరో దేవాలయంపై దాడి..!

-

Miscreants Vandalize Hanuman Temple in Hyderabad: హిందూ దేవాలయాలపై దుండగుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే… తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కాలనీలో మరో దారుణం చోటు చేసుకుంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కాలనీలో ఉన్న హనుమాన్ దేవాలయం వద్ద ఉన్న నవగ్రహాల విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులు… పరారీ అయ్యారు.

Miscreants Vandalize Hanuman Temple in Hyderabad

స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని చెబుతున్నారు. నవగ్రహాల విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఉదయం పూజ చేసేందుకు వచ్చిన పూజారికి విగ్రహాలు చెల్లాచెదురుగా పడి ఉండడంతో కాలనీ వాసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో నిందితులను శిక్షించాలని ఆలయం దగ్గర నిరసన వ్యక్తం చేశాయి బీజేపీ, హిందూ సంఘాలు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version