హోం మంత్రి పదవికి అనిత తక్షణం రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావ్. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సమాధానం చెప్పలేక అనిత టాపిక్ డైవర్ట్ చేస్తోందని… అనిత ఓ రిమోట్ కంట్రోల్ హోం మంత్రి అంటూ చురకలు అంటించారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావ్. దళిత మహిళను అడ్డు పెట్టుకొని రెడ్ బుక్ అమలు చెయ్యాలని ఈ ప్రభుత్వం చూస్తోందని ఆగ్రహించారు.
పాయకరావు పేట ఎమ్మెల్యేగానే అన్ఫిట్ అయిన అనిత హోం మంత్రిగా ఏ విధంగా సక్సెస్ అవుతుందని నిలదీశారు. ఆర్నెల్ల కాలంలో అనిత నియోజకవర్గంలో వున్నది ఆరు రోజులే ఉందని మండిపడ్డారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావ్. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకుని సమర్థవంతంగా పనిచేస్తానని చెప్పి వుంటే బాగుంటుందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 30వేల మంది అదృశ్యం అయితే ఈ ఆరునెలల కూటమి ప్రభుత్వం లో ఎన్ని కేసులు ట్రేస్ చేయగలిగారు
హోం మంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావ్.