కామారెడ్డి లో మాస్టర్ ప్లాన్ పై కామారెడ్డి రైతులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తమను సంప్రదించకుండా రిక్రియేషన్ జోన్ గా ప్రకటించారని రైతులు పిటిషన్ లో పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్ తమకు నష్టం చేకూర్చే విధంగా ఉందని అన్నారు రైతులు. అయితే రైతులు దాఖలు చేసిన రిట్ పిటిషన్ నేడు హైకోర్టులో విచారణకు వచ్చింది.
ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకువచ్చినరీ క్రియేషన్ మ్యాపును న్యాయవాది సృజన్ రెడ్డి హైకోర్టుకు సమర్పించారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలుకు అడ్వకేట్ జనరల్ సమయం కావాలని కోరారు. దీంతో బుధవారం వరకు న్యాయస్థానం సమయం ఇచ్చింది. అడ్వకేట్ జనరల్ వినతి మేరకు తదుపరి విచారణను ధర్మసనం బుధవారానికి వాయిదా వేసింది.