స్ఫూర్తి: ”బీటెక్ పానీపూరివాలి”.. నచ్చినది చేస్తేనే కదా సంతృప్తి వచ్చేది.. తాప్సి ఉపాధ్యాయ్ సక్సెస్ స్టోరీ మీకోసం..!

-

లైఫ్ లో మనం ఎన్నో అనుకుంటూ ఉంటాం కానీ అన్నీ సంతృప్తిని కలిగించవు. లైఫ్ లో కొన్ని మాత్రమే మనకి సంతృప్తిని ఇస్తాయి. చాలామంది పెద్దపెద్ద ఉద్యోగాలు చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తారు. కానీ సంతృప్తి ఉండదు. ఈమధ్య కాలంలో చాలా మంది గ్రాడ్యుయేట్స్ స్టాల్స్ వంటి వాటిని పెడుతున్నారు. మనం ఎంఏ చదువుకున్న వాళ్ళు కూడా టీ స్టాల్ ని ఓపెన్ చేయడం చూసాము.

తాజాగా 21 ఏళ్ల బీటెక్ గ్రాడ్యుయేట్ పానిపురి స్టాల్ ని ప్రారంభించారు. స్ట్రీట్ ఫుడ్ ని ఆరోగ్యకరమైన స్నాక్ కింద ఆమె తీసుకువచ్చారు. చాలామందికి స్ట్రీట్ ఫుడ్ అంటే ఆరోగ్యానికి మంచిది కాదని శుభ్రత ఉండదని అంటూ ఉంటారు అందుకోసం ఆమె ఆరోగ్యకరమైన పానీపూరిని తయారు చేయడం మొదలుపెట్టారు.

ఈ మధ్యకాలంలో చాలా మంది వ్యాపారాల మీద దృష్టి పెడుతున్నారు కంపెనీలలో ఆఫీసులో పని చేసీ చేసీ విసిగిపోయి వ్యాపారమే మంచిదని నిర్ణయం తీసుకుని నచ్చిన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. గ్రాడ్యుయేట్లు కూడా ఈ మధ్యకాలంలో టీ స్టాల్స్ పానీ పూరి స్టాల్స్ వంటి వాటిని ప్రారంభిస్తున్నారు. నిజానికి మనం చేసే పనిలో సంతృప్తి ఉంటే చాలు సక్సెస్ అయినట్టే.

21 ఏళ్ల తాప్సీ ఉపాధ్యాయ స్ట్రీట్ ఫుడ్ ప్రేమికుల కోసం బీటెక్ పానీపూరివ వాలి అని స్టార్ట్ చేశారు ఆమె ఉద్దేశం ఏంటంటే పాణి పూరీని ఆరోగ్యంగా ఇవ్వాలని.. ఒకసారి వాడిన నూనెలో పదే పదే పానీపూరీలని వేపుతూ ఉంటారు చాలామంది పానీపూరి అమ్మేవాళ్ళు. కానీ ఈమె అలాంటి తప్పులు చేయరు. అలానే శుభ్రంగా ఉండేందుకు గ్లౌజులు కూడా ధరిస్తుంది మరికొన్ని స్ట్రీట్ ఫుడ్ ఆప్షన్స్ ని కూడా త్వరలో తీసుకువస్తానని ఆమె చెప్తున్నారు.

అలానే చాలామంది అమ్మాయిలు వెనకే ఉండిపోతున్నారని అమ్మాయిల కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఆమె అన్నారు ఏది ఏమైనా నచ్చిన చేస్తే తృప్తి ఉంటుంది ఇలా ఈమె తనకి నచ్చిన మార్గాన్ని ఎంచుకుని సక్సెస్ అయ్యింది. ఈమెని ఆదర్శంగా తీసుకుంటే మీరు కూడా సక్సెస్ అవ్వచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version